రెగె జీన్ పేజ్.. ప్రపంచంలోనే అందమైన వ్యక్తి

రెగె జీన్ పేజ్.. ప్రపంచంలోనే అందమైన వ్యక్తి

ప్రపంచంలోనే ఎత్తైన మనిషి ఎవరు అంటే చెప్పగలం.. ప్రపంచంలోనే అధిక సంపన్నులు ఎవరంటే చెప్పగలం కానీ.. ప్రపంచంలోనే ఎవరు అందమైన వ్యక్తి అంటే చెప్పడం చాలా కష్టం కదా. ఒక్కొక్కరి శరీరం రంగు, ఆకృతి ఒక్కోలా ఉంటాయి. కానీ శాస్త్రీయంగా కొన్ని పద్దతుల్లో అందమైన వ్యక్తులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతే కాదు ఆ వ్యక్తి ఎవరో కూడా తేల్చేశారు. అతనే బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్. ఇందుకోసం సాంప్రదాయ ఫేస్‌ మ్యాపింగ్ పద్ధతి గ్రీక్‌ గోల్డెన్‌ రేషియో ఆఫ్‌ బ్యూటి ఫైని ఉపయోగించారు. దీంతో  ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించగలిగారు. 

ఈ మ్యాపింగ్‌ ప్రక్రియ ప్రకారం జీన్‌ పేజ్‌ కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, దవడ, ముఖం అమరికను అంచనా వేశారు. అలా ఇతడి ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో థోర్‌ సినిమాలో నటించిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ (93.53 శాతం), బ్లాక్‌ పాంథర్‌ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్‌ (93.46 శాతం), సింగర్‌ హ్యారీ స్టైల్‌ (92 .30 శాతం)ల ముఖాలు ఉన్నట్లు వెల్లడించారు. శాస్త్రీయంగా జీన్ పేజ్ కి అందమైన ముఖం, గోధుమ రంగు కళ్లు ఉన్నాయి. కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండటంతో అతని ముఖం అందమైనదిగా పరీక్షల్లో నిర్ధరణ అయిందని డాక్టర్‌ జూలియన్‌ డి సిల్వా స్పష్టం చేశారు.