తగ్గించండయ్యా : ఉప్పు తెగ తినేస్తున్న జనం.. కనీసం కంటే 3 గ్రాములు అధికంగా..

తగ్గించండయ్యా : ఉప్పు తెగ తినేస్తున్న జనం.. కనీసం కంటే 3 గ్రాములు అధికంగా..

నేచర్ పోర్ట్‌ఫోలియో జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, సగటు భారతీయుడు పరిమితికి మించి ఉప్పును వినియోగిస్తున్నారు. సాధారణంగా రోజూ వారి ఆహారంలో ఉప్పును 5గ్రా వరకు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ దానికి మించి రోజుకు 8గ్రా తీసుకుంటున్నారని ఈ సర్వే తెలిపింది. శాంపిల్ సర్వే ఆధారంగా జరిపిన ఈ అధ్యయనంలో పురుషులు, ఉద్యోగస్తులు, పొగాకు వాడేవారు, ఊబకాయం ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకుంటారని తేలింది.

3వేల మందిపై జరిపిన ఈ అధ్యయనం.. వారు తీసుకునే ఉప్పు ప్రామాణికతపై సర్వే చేసింది. ఇందులో మహిళల (రోజుకు 7.9 గ్రా)తో పోలిస్తే పురుషులే అధిక మొత్తంలో అంటే రోజుకు 8.9 గ్రా ఉప్పును వినియోగిస్తున్నట్టు తేలింది. అదేవిధంగా, ఉపాధి (8.6గ్రా.), పొగాకు వినియోగదారులు (8.3గ్రా.), ఊబకాయం (9.2గ్రా.), రక్తపోటు ఉన్నవారు (8.5గ్రా.) ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఇది రక్తపోటు లేదా అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుందని తెలిపింది.

ALSO READ :  చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

ఒక వ్యక్తికి రోజు తీసుకోవాల్సిన ఉప్పు శాతం 5 గ్రాముల కంటే తక్కువ. ఇది నరాలు, కండరాల పనితీరుకు చాలా అవసరం. దీన్ని ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకుంటే..

➤ ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకుంటే హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. ఇది గుండెపోటు, స్ట్రోక్‌ను ప్రేరేపిస్తుంది.

తక్కువ ఉప్పు..

  • తక్కువ సోడియం లవణాలు కలిగిన ఉప్పులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తికి మంచిది.
  • కానీ ఇది మధుమేహం, గుండె, మూత్రపిండ వ్యాధులు ఉన్న వ్యక్తులలో హైపర్‌కలేమియాకు కారణమవుతుంది.
  • దీని వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి.. పల్స్ మందగించడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం లేదా కండరాల బలహీనత వంటి లక్షణాలను కలిగిస్తాయి.

కావున ప్రత్యామ్నాయాల కోసం వెతకడానికి బదులుగా, రక్తపోటును తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి రోజూ వారి ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.