లాక్‌డౌన్‌ను మరిన్ని వారాలు పొడిగించాలి

లాక్‌డౌన్‌ను మరిన్ని వారాలు పొడిగించాలి

న్యూఢిల్లీ: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో మరిన్ని వారాలపాటు లాక్ డౌన్ కొనసాగించాలని ఐసీఎంఆర్ సూచించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మరో ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్ డౌన్ ను అమలు చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ బలరామ్ భార్గవ్ అన్నారు. ఇన్ఫెక్షన్ రేటు 10 శాతానికి పైగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ ను పొడిగించాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నారు.

'కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలను మూసేసి ఉంచాలి. పాజిటివ్ రేటు 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే లాక్ డౌన్ తీసేయ్యొచ్చు. ఆరు నుంచి ఎనిమిది వారాల తో మనం. దీన్ని సాధించగలం ' అని బలరామ్ పేర్కొన్నారు. దేశంలో సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ సర్కార్ ను తప్పు పట్టలేమన్న భార్గవ.. వైరస్ అదుపు చర్యల్లో మాత్రం ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు.