సన్ సెట్ టు సన్రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ. దయానంద్ తెలిపారు. రేవ్ పార్టీ లో 101 మంది పాల్గొన్నారని చెప్పారు. రేవ్ పార్టీ పై సీసీబీ పోలీసులు డాది చేశారని వెల్లడించారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయని పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలవారు ఉన్నారని చెప్పారు. పార్టీలో ఒక నటి ఉన్నారని వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని తెలిపారు. రేవ్ పార్టీ పై డాది చేసిన సమయంలో డ్రగ్స్ ను నాశనం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. స్విమ్మింగ్ ఫూల్స్, ప్రహరీ వెలుపల పడేశారని అన్నారు. డ్రగ్స్ ని డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం ఐదుగురిమీద కేసు నమోదు చేశామని తెలిపారు. రేవ్ పార్టీ కి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందని వెల్లడించారు కమిషన్ దయానంద్.
