Deepak Boxer : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ అరెస్ట్

Deepak Boxer : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మెక్సికోలో బాక్సర్‌ను పట్టుకుంది. దీపక్ బాక్సర్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో ఇండియాకు తీసుకురానున్నారు. విదేశాల్లో ఢిల్లీ పోలీసులు ఓ  గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి.

https://twitter.com/ANI/status/1441324350880174083

గతేడాది ఆగస్టులో ఢిల్లీ సివిల్ లైన్స్  బిల్డిర్ అమిత్ గుప్తా మ‌ర్డర్ కేసులో బాక్సర్ దీప‌క్ కోసం పోలీసులు చాన్నాళ్లుగా అన్వేషిస్తున్నారు.   రోహిణి కోర్టులో జితేంద్ర గోగి హత్య తర్వాత, దీపక్ బాక్సర్ గోగి గ్యాంగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.  బాక్సర్ దేశం విడిచి వెళ్లేందుకు నకిలీ పాస్‌పోర్టును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

జనవరి 29న కోల్‌కతా నుంచి రవి అంటిల్ అనే వ్యక్తి పేరుతో విమానంలో మెక్సికో వెళ్లాడు. దీపక్ బాక్సర్‌పై పోలీసులు రూ. 3 లక్షల రివార్డును కూడా  ప్రకటించారు. అనేక కేసుల్లో దీపక్ నిందితుడిగా ఉన్నాడు.