ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

భద్రాచలం, వెలుగు: ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోని కల్మీటా- కటువా పదర్  అడవుల్లో డీవీఎఫ్​, బీఎస్ఎఫ్​ జవాన్లతో కూంబింగ్​ నిర్వహించినట్లు ఎస్పీ వినోద్​ పాటిల్ తెలిపారు. 

ఇన్సాస్​ మిషన్​ గన్, ఎల్ఎంజీ, రెండు ఇన్సాస్​  రైఫిల్స్, 2 టిఫిన్​ బాక్స్  బాంబులు, ఒక గ్రైనేడ్, 8 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఏకె-47 మ్యాగ్​జైన్, 18 ఎలక్ట్రిక్​ వైర్​ బండిల్స్  స్వాధీనం చేసుకున్నారు.