న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కువైట్ దేశాధినేత షేక్ మెషాల్‌తో ఫోన్ లో మాట్లాడారు. పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతల తగ్గింపు, దౌత్య చర్చల ప్రాధాన్యత, భద్రతా పరిస్థితులపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అలాగే, కువైట్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే జూన్ 3 న కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి చేసింది.
