గద్వాల, వెలుగు: ఫ్రిజ్ కంప్రెసర్ పేలిన ఘటనలో తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు.. ధరూర్ మండల కేంద్రంలో రెండు రోజుల కింద ఇంట్లో ఫ్రిజ్ కంప్రెసర్ పేలడంలో ఇద్దరు మహిళలు, ఆరు నెలల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం మధ్యాహ్నం బాలుడు, సాయంత్రం తల్లి అశ్విని మృతిచెందారు. మరో మహిళ చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లి, కొడుకు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

