కేరళలో ప్రభుత్వ కొలువు సాధించిన తల్లీకొడుకులు

కేరళలో ప్రభుత్వ కొలువు సాధించిన తల్లీకొడుకులు

మళప్పురం: తన కొడుకు పదో క్లాస్​లో ఉన్నప్పుడు ప్రోత్సహించేందుకు పుస్తకాలు పట్టిన తల్లి..తాను కూడా సర్కార్ కొలువు సాధించింది. అంగన్​వాడీ టీచర్​గా పనిచేస్తున్న కేరళలోని మళప్పురానికి చెందిన బిందు తొమ్మిదేండ్ల పాటు చదివి తన కొడుకుతో పాటు ప్రభుత్వ జాబ్ కొట్టింది. 42 ఏండ్ల వయసున్న బిందుకు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ ఎగ్జామ్​లో 92వ ర్యాంకు రాగా, ఆమె 24 ఏండ్ల కొడుకు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎగ్జామ్​లో 38వ ర్యాంక్ సాధించాడు.

దీంతో ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. అయితే తనకు ఈ అవకాశం అంత ఈజీగా ఏమీరాలేదని బిందు మీడియాతో చెప్పుకొచ్చింది. కొడుకుతో పాటు తాను కోచింగ్​కు వెళ్లానని తెలిపింది. నాలుగో అటెంప్ట్​లో ఉద్యోగం సాధించానని వివరించింది. తన టార్గెట్​ ఐసీడీఎస్ సూపర్​వైజర్ పోస్ట్ అని బిందు చెప్తోంది.