
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో ఒక ఎనిమిదేళ్ల బాలుడు కుర్కురే (Kurkure) కొనివ్వమని 20 రూపాయలు అడిగినందుకు అతని తల్లి, సోదరి తాడుతో కట్టి కొట్టారని పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
బాలుడు ఫిర్యాదు చేసిన తీరు, దానికి పోలీసు సిబ్బంది మాట్లాడిన విధానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ సంఘటన ఖుతార్ అవుట్‌పోస్ట్ పరిధిలోని చితర్‌వై కాలా అనే గ్రామంలో జరిగింది. అయితే ఫిర్యాదు చేసాక ఆ పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది అతన్ని ఓదార్చుతూ, త్వరలోనే వస్తామని చెప్పారు. ఈ సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా చక్కర్లు కొడుతుంది.
ALSO READ : గంజాయి స్మగ్లింగ్లో మాజీ సోల్జర్ ..
పిల్లాడి ఫోన్ కాల్ తరువాత పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటన జరిగిన చోటుకి వెళ్లారు. అక్కడ పిల్లాడిని, అతని తల్లిని పిలిచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కొట్టొదని తల్లికి చెబుతూ.... ఆ పిల్లాడికి కుర్కురే కూడా కొనిచ్చారు.