భర్తను కొట్టి భార్యపై 17 మంది అత్యాచారం

భర్తను కొట్టి భార్యపై 17 మంది అత్యాచారం

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. భర్తను కట్టేసి భార్యపై 17 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన డుమ్కా జిల్లాలో డిసెంబర్ 8 మంగళవారం జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దంపతులు మంగళవారం సాయంత్రం స్థానికంగా నిర్వహించే వారాంతపు సంతకు వెళ్లారు. వీరు మార్కెట్ నుంచి సాయంత్రం 7 గంటల సమయంలో తమ ఇంటికి తిరిగి వస్తుండగా.. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న కొంతమంది యువకులు దంపతులను అడ్డగించారు. వారిద్దరిని ఆ యువకులు రోడ్డు పక్కన ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి భర్తను కొట్టి కట్టేశారు. ఆ తర్వాత యువకులు మహిళపై అత్యాచారం చేశారు. నిందితులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో దంపతులిద్దరిని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న దంపతులు.. స్థానికులతో చర్చించి ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయిదుగురు పిల్లల తల్లి అయిన 35 ఏళ్ల మహిళపై దారుణానికి ఒడిగట్టిన యువకుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సుదర్శన్ మండల్, దుమ్కా పోలీసు సూపరింటెండెంట్ అంబర్ లక్రా బాధితురాలి గ్రామాన్ని సందర్శించి ఘటన గురించి దర్యాప్తు జరిపారు.

బాధితురాలికి ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు చేయించామని.. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారని డీఐజీ మండల్ తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిలో బాధితురాలు ఒకరిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని.. అతని ద్వారా మిగతావారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు.

For More News..

ఆహారాన్ని ముట్టుకున్నాడని కొట్టి చంపారు

హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకున్నా ఫైన్

మరో నెలలో పెళ్లనగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య