
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకింది. కొడంగల్ మండలం హస్నాబాద్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలైన రాజు, రజిత, అనితతో కలిసి హుస్నాబాద్ చెరువు వద్దకు వచ్చి చెరువులో దూకింది. పిల్లలకు చున్నీతో కట్టి చెరువులో పడేసింది. ఆ తర్వాత ఎల్లమ్మ కూడా చెరువులో దూకింది. అయితే ఆ పిల్లల్లో అనిత అనే అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కానీ ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో మునిగి మృతిచెందారు. అభం శుభం తెలియని పిల్లలు చనిపోవడంతో ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల వారిని తీవ్రంగా కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..