కేసీఆర్ పార్టీలోకి పిలిచి అవమానించిండు : మోత్కుపల్లి

కేసీఆర్  పార్టీలోకి పిలిచి అవమానించిండు : మోత్కుపల్లి

 బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 30 మందిని మారిస్తే కానీ కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రాలేరని మోత్కుపల్లి నర్సింలు అన్నారు.  తెలంగాణలో  30 సీట్లపై ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉంటుందన్నారు .  చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బేగంపేటలోని ఆయన ఇంట్లో దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ తనను బీఆర్ఎస్ లోకి పిలిచి అవమానించారని మండిపడ్డారు. 

కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబేనని.. అలాంటిది కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. రేపు కేసీఆర్ కు కూడా చంద్రబాబు పరిస్థితి వస్తే అర్థమవుతుందన్నారు.   సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. ఈ ఒక్కసారైనా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు.  ఏది ఏమైనా రేవంత్ వల్లే కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. 

 చంద్రబాబు మానసికంగా ఇబ్బందిపడుతున్నారని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ తాత్కాలికంగా సంతోష పడుతున్నారని తెలిపారు.  కేసీఆర్,జగన్, బీజేపీ ముగ్గురు కలిసి ఆయన జైల్లో పెట్టి బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ పాలన వల్ల ఎవరూ సంతోషంగా లేరన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ALSO READ : ODI World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్, గెలిస్తేనే సెమీస్ ఆశలు