
కొమరం భీం జిల్లా : తహసిల్దార్ ఆఫీసును ప్రభుత్వ స్కూల్ లోకి మారుస్తుండగా గ్రామస్ధులు అడ్డుకున్నారు. ఈ సంఘటన కొమరం భీం జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. చింతల మానేపల్లి తహసిల్దార్ ఆఫీస్ ను రవీంద్ర నగర్ ప్రభుత్వ పాఠశాలలోకి మార్చారు రెవెన్యూ అధికారులు. అయితే తహసీల్దారు కార్యాలయాన్ని రవింద్రనగర్ కు తరలిస్తున్న క్రమంలో సామాగ్రిని తరలిస్తున్న వ్యాన్ ను అడ్డుకున్నారు గ్రామస్థులు. భూ రికార్డులు.. పలు సమస్యలపై తమకు పాస్ బుక్కులు అందజేశాకే తహసిల్దార్ కార్యాలయాన్ని తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.