సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు

సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు

కరోనావైరస్ తో అన్ని రంగాలు మూతపడ్డాయి. పనులు లేకపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలామంది కొత్త కొత్త వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా మూతపడింది. షూటింగులు లేకపోవడంతో చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలా ఖాళీగా ఉండటం ఇష్టంలేక.. ఆర్థికంగా నిలబడడం కోసం ఓ తమిళ దర్శకుడు కిరాణ కొట్టు పెట్టుకున్నాడు. చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్.. తన కుటుంబపోషణ కోసం కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. పదేళ్లకు పైగా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఉన్న ఆనంద్.. దేశంలోని సినిమా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవని అన్నారు. సినిమా హాళ్లు ఓపెన్ అయిన తర్వాత సినీ పరిశ్రమకు వస్తానని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న డబ్బుతో చెన్నైలోని మౌలివాక్కంలో స్నేహితుడికి చెందిన ఒక షట్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. అందులో ఒక కిరాణా షాపు స్టార్ట్ చేశాడు.

‘లాక్డౌన్ కాలంలో నేను ఇంటికే పరిమితం అయ్యాను. తమిళనాడులో కిరాణా మరియు ప్రొవిజన్ షాపులను మాత్రమే తెరవడానికి అనుమతి ఇచ్చారు. అందుకే నేను కూడా ఒక షాపు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను చమురు, పప్పుధాన్యాలు, బియ్యం మరియు అన్ని ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్ముతున్నాను. దాంతో చాలా ఎక్కువమంది కొనుగోలుదారులు నా షాపుకు వస్తున్నారు. ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమను అన్‌లాక్ చేసేట్లు నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజలకు కరోనా భయం పోతేనే సినిమాలు చూడటానికి వస్తారు. మాల్స్, పార్కులు మరియు బీచ్‌లు తెరిచిన తర్వాతే సినిమా థియేటర్లు తెరుచుకుంటాయి. అప్పుడే మాకు పని ఉంటుంది. అప్పటివరకు నేను నా కిరాణా దుకాణం నడుపుకుంటాను’ అని ఆనంద్ తెలిపారు.

ఆనంద్ గతంలో ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ మరియు ‘మౌనా మజాయ్’ వంటి బడ్జెట్ చిత్రాలతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ‘తునింతు సీ’చిత్రం చివరి దశలో ఉంది. కేవలం రెండు పాటలు తప్ప ఈ చిత్ర నిర్మాణం మొత్తం పూర్తయింది.

For More News..

అందరికీ నార్మాల్ మాస్క్.. ఈయనకు మాత్రం గోల్డ్ మాస్క్

ఆన్​లైన్ క్లాసులతో ఫాయిదా లేదు