నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా

నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా

ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సన్మానించిన సినీ హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్

కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సన్మానించారు సినీ హీరో విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హీరో విజయ్ దేవర కొండ ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ను లాంచ్ చేశారు. పాస్ల్మా దాతలకు మరియు స్వీకర్తలకు సైబరాబాద్ పోలీసులు వారధిగా నిలుస్తున్నార‌న్నారు.

ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నానని సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుందని, సామాజిక బాధ్యత లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని అన్నారు. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారని… ప్లాస్మా దానం చేసిన కరోనా యోధులు దేవుడితో సమానమ‌ని అన్నారు. ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడవచ్చని ఆయ‌న అన్నారు. శుక్ర‌వారం కూడా 120 మంది ప్లాస్మా దానం చేశారని, 200 మంది పేషెంట్‌ల‌ను కాపాడమని ఆయ‌న అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ….ప్లాస్మా దానం ఇవ్వడం వల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్ రావని అన్నారు. త‌మ దగ్గరి బంధువుల‌కు కరోనా వైర‌స్ సోక‌డంతో వారికి ప్లాస్మా అవసరం వచ్చింద‌ని, కానీ ఎక్కడ ప్లాస్మా దాతలు దొరకలేదన్నారు. ప్లాస్మా ప్రాధాన్యత ఏమిటో అప్పుడు తెలిసిందని చెప్పారు. ప్లాస్మా దానం చేసే ఇద్దరిని కాపాడిన వారు అవుతారని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న‌కు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు.

Movie hero Vijay Devarakonda and CP Sajjanar honored plasma donaters