పైరసీకి నో బ్రేక్..ఒక్క రోజులోనే మూవీరూల్జ్ లో కొత్త మూవీలు

పైరసీకి నో బ్రేక్..ఒక్క రోజులోనే మూవీరూల్జ్ లో  కొత్త మూవీలు

హైదరాబాద్: పైరసీ మాఫియా టాలీవుడ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంటనే పైరసీ సైట్ల దెబ్బకు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పం టీవీ సైట్లు బ్లాక్ చేసినా, మూవీ పైరసీ దండా మాత్రం ఆగడం లేదు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మూవీ పైరసీ వైబ్ సైట్లపై ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ పైరసీకి బ్రేక్ పడటం లేదు. మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా మూవీ రూల్డ్ మాత్రం యథేచ్ఛగా దందాను కొనసాగిస్తోంది.

 తన కార్యకలాపా లను ఎప్పటికప్పుడు దారులు మార్చుకుంటూ, సాంకేతిక మార్పులు చేసుకుంటూ సినీ పరిశ్ర మకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా ఈశు క్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్డ్ లో ప్రత్యక్షమయ్యా యి. అల్లరి నరేశ్ నటించిన 12ఏ రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి. ప్రేమంటే సినిమాలను థియేటర్ లో క్యాం కార్టర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్లను అన్లోడ్ చేశారు. థియేటరు వెళ్లి టికెట్లు కొనుగోలుచేయలేని లేదా చేయకూడదనుకునే ప్రేక్షకులను ఈ పైరసీ ప్రింట్లు ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల టాకీస్ల ఆదాయం గణనీయంగా పడిపోతోం ది. నిర్మాతలకు వచ్చే లాభాలపై, పంపిణీదారుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 ఇప్పటికే ఐ బొమ్మరవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ ఈ పైరసీ మాఫియా ఒక్కొక్కరిని అరెస్టు చేసినా, కొత్త వెబ్సైట్లు, కొత్త డొమైన్ పేర్లతో మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీని వెనుక బలమైన అంతర్జాతీయని  నెట్ వర్క్, సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తు న్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుండగానే.. ఇంకోవైపు పైరసీ వెబ్ సైట్లలో కొత్త సినిమాలు వైబ్సైట్లో అప్లోడ్ కావడం సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ గా మారింది. ఐబొమ్మవన్, మూవీ రూల్జ్ లు ఎలా కట్టడి చేయాలన్నది ఇప్పుడు పోలీసులకు కొత్త సవాల్ గా ఎదురైంది అటు పైరసీదందాతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ సినిమా నిర్మా తలు వాపోతున్నారు.