సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడు అని చాలాసార్లు నిరూపించుకున్నారు కూడా. తండ్రీ, కొడుకులు సినీ ఇండస్ట్రీలో ఉన్నా.. ఇద్దరూ కలిసి నటించే సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. కానీ కృష్ణ, మహేష్ బాబు కలిసి 10 చిత్రాల్లో నటించడమే కాకుండా..అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆల్మోస్ట్ మంచి హిట్ కొట్టినవే కావడం చెప్పుకోదగిన విషయం.

తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ..

కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా..ఆ తర్వాత మహేష్ చేసిన సినిమాలు ఆయనకు స్పెషల్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి నటించిన విషయానికొస్తే.. మహేష్ బాలనటుడిగా 7 చిత్రాల్లో నటించగా.. హీరో అయ్యాక మరో 3 మూవీస్ లో నటించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు చిన్నప్పటి నుంచే పలు చిత్రాల్లో నటించడం ప్రారంభించారు. అందులో ఎక్కువగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో  నటించడం గమనార్హం.

  • పోరాటం( కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. అన్నదమ్ములుగా)
  • శంఖారావం( కృష్ణ స్వీయ దర్శకత్వంలో... తండ్రీ, తనయులుగా)
  • బజారు రౌడీ (కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో... కృష్ణ ఫ్యాన్ గా మహేష్)
  • ముగ్గురు కొడుకులు ( ఈ చిత్రంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా యాక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని కూడా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముళ్లుగా ఆయన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు  సోదరులుగా నటించడం విశేషం)
  • గూఢచారి 117 (కోడి రామకృష్ణ దర్శకత్వంలో...)
  • కొడుకు దిద్దిన కాపురం (కృష్ణ స్వీయ దర్శకత్వంలో ... తండ్రీ, తనయులుగా)
  • అన్న తమ్ముడు (కృష్ణ స్వీయ దర్శకత్వంలో..)
  • రాజ కుమారుడు ( రాఘవేంద్రరావు దర్శకత్వంలో .. కృష్ణ గెస్ట్ పాత్రలో, మహేష్ హీరోగా)
  • వంశీ (బి.గోపాల్ దర్శకత్వంలో...)
  • టక్కరి దొంగ ( ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా కలిసి నటించడం విశేషం. మొత్తంగా తండ్రీ తనయులు కాకుండా కోడలు కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం విశేషం)