8500 పేజీల RTI సమాచారంతో ఎడ్లబండిపై ఊరేగింపు

8500 పేజీల RTI సమాచారంతో ఎడ్లబండిపై ఊరేగింపు

ఓ వ్యక్తి ఆర్టీఐ నుంచి 8500  పేజీల సమాచారాన్ని సేకరించిండు. దీనికోసం అప్పు చేసి రూ.25 వేలు డిపాజిట్  కట్టి మరి సమాచారం పొందాడు.  అనంతరం  అతను ఆ సమాచారంతో ఎద్దులబండిపై డప్పు వాయింపులతో ఊరేగింపుగా విజయోత్సవ ర్యాలీ తీసిండు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 

మఖన్ ధాకడ్ అనే ఆర్టీఐ కార్యకర్త బైరాద్ నగర్ పంచాయితీలో జరిగిన అవకతవకలపై సమాచారం కావాలని  2 నెలల క్రితం ఆర్టీఐకి అప్లై చేశాడు. పీఎం హౌసింగ్, సంబల్ పథకం  పనుల చెల్లింపుల వంటి వివరాలు కావాలని అడిగారు. అయితే అధికారులెవరూ స్పందించకపోవడంతో మఖన్ ధాకడ్.. భోపాల్ లోని ఆర్టీఐ కమిషనర్  ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ అధికారులు 8500 పేజీల సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని తీసుకున్న ధాకడ్ .. ఎడ్లబండిపై నగర పాలకసంస్థ నుంచి డబ్బుల సౌండ్ తో ఊరేగింపుగా వెళ్లాడు.  

తాను రెండు నెలల క్రితమే 12 వేల పేజీల సమాచారం కోసం  ఆర్టీఐకి అప్లై చేశానని..దీనికి  రూ.25 వేలు డిపాజిట్ కూడా చేశానని మఖన్ ధాకడ్ చెప్పారు. అయితే డబ్బులు కట్టినా అధికారులు తనకు పూర్తి సమాచారం ఇవ్వలేదని చెప్పాడు. అధికారులు ఇచ్చిన 8500 పేజీలను  లెక్కించడానికి నలుగురు వ్యక్తులను తీసుకెళ్లానని.. దానికి 2గంటల సమయం కూడా పట్టిందని అతడు చెప్పాడు.