కాంగ్రెస్‌‌‌‌లో చేరినోళ్లను బెదిరిస్తున్నరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌లో చేరినోళ్లను బెదిరిస్తున్నరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 హుజూర్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే తీరు నచ్చక బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్‌‌‌‌లో చేరిన నేతలను సైదిరెడ్డి అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్నారని  ఎంపీ, కాంగ్రెస్ హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.  సోమవారం పట్టణంలోని ఫణిగిరి రామచంద్ర మోడల్ కాలనీకి చెందిన 300 మంది  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు రాజీనామా చేసి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడ్డవద్దని, మరోసారి కాలనీ వైపు వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాను అండగా ఉంటానని మాటిచ్చారు. తాను మంత్రిగా ఉన్నసమయంలో  పేదల కోసం వేల ఇండ్లతో మోడల్ కాలనీ నిర్మాణం చేపట్టానని గుర్తు చేశారు.  ఇందులో 80 శాతం ఇండ్లు పూర్తయినా.. మిగితా పనులు కంప్లీట్ చేయకుండా డంపు యార్డుగా మార్చారని  మండిపడ్డారు.  

ALSO READ : ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగమవుతున్న హరితహారం

ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వకపోగా ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారిని పోలీసులతో ఖాళీ చేయించాలని చూశారాని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు.  సొంత గూడు లేని ప్రతి పేదవాడికి  ఇండ్లు నిర్మించి ఇస్తానని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు సాముల శివారెడ్డి, గెల్లి రవి, దొంతగాని శ్రీనివాస్ గౌడ్, అల్లం ప్రభాకర్ రెడ్డి, కోతి సంపత్ రెడ్డి  తదితరులు  పాల్గొన్నారు .