అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన గంటల్లోనే నిందితులకు బెయిల్ వచ్చింది. ఎనిమిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో నిందితుల తరపు వాదనలు వినిపించారు. తిరుపతి వర్మ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు..ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి ఇద్దరి పూచీకత్తు.. 5వేల రూపాయల పర్సనల్ బాండ్ మీద విడుదలకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. మన్నె గోవర్ధన్ రెడ్డి, రాజారం యాదవ్, సత్యనారాయణ, భీమ్ రాజు, కడారి స్వామి, చింత శ్రీకుమార్, ఆంజనేయులు, జంగయ్య..అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు. ఇవాళ సాయంత్రం వరకే వారికి బెయిల్ దొరికింది. 

బంజారాహిల్స్ లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు శుక్రవారం దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్మీచర్, దేవుడి ఫోటోలు, అద్ధాలు ధ్వంసం చేశారు.అర్వింద్ తల్లిని బెదిరించారు. దీంతో అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పలువురు టీఆర్‌‌ఎస్‌‌ నాయకులపై బంజారాహిల్స్‌‌ పోలీసులు నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు నమోదు చేశారు. ఇదే ఘటనపై ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ కూడా ఫిర్యాదు చేశారు.