కేంద్రమంత్రి అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న ప్రధాని మోడీతో భేటీ అయిన అర్వింద్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.  తెలంగాణలో తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, పార్టీలో చేరికలు గురించి చర్చించారు. అలాగే బీఆర్ఎస్ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. బిఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను కూడా అమిత్ షా దృష్టికి ఎంపీ అరవింద్ తీసుకువచ్చారు.

నిన్న మోడీతో భేటీ

అంతకుముందు మంగళవారం పార్లమెంట్‌‌‌‌లోని పీఎం ఆఫీసులో మోడీతో అర్వింద్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు అర్వింద్‌‌‌‌తో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. తర్వాత తన నివాసంలో మీడియాతో అర్వింద్ చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని పొలిటికల్, పాలన వ్యవస్థ తీరును ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నట్లు అర్వింద్ద్ చెప్పారు. తెలంగాణలో కమల వికాసంపై స్టేట్ లెవల్ లీడర్స్ కన్నా, బీజేపీ అధిష్టానం ఫుల్ క్లారిటీతో ఉందన్నారు. రాష్ట్రంలో ఇకపై ‘సాఫ్ సఫాయి’ జరుగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 80 స్థానాల్లో గెలిచేలా బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టిందని అన్నారు. దాదాపు ఐదు సార్లు బీఆర్ఎస్ నేతలు తనపై చేసిన దాడుల గురించి ప్రధాని వాకబు చేశారని తెలిపారు. ఇటీవల తన ఇంటిపై జరిగిన దాడి గురించి ప్రధాని ఆరా తీశారని వివరించారు.