పిలవని పేరంటానికి వెళ్లి మద్దతిచ్చారు

పిలవని పేరంటానికి వెళ్లి మద్దతిచ్చారు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. అందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమే నిదర్శనమన్నారు. పిలవని పేరంటానికి వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చారన్నారు.  బీజేపీ దళితుడిని రాష్ట్రపతిని చేసిందని..ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేయబోతుందని చెప్పారు. కానీ కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదన్నారు.

దేశవ్యాప్తంగా హడావుడి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏమైంది అని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.  50 వేల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు ఆపేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలో చెలగాటం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పని చేసే వాళ్లనే బీజేపీ జాయిన్ చేసుకుంటుందని... భూ కబ్జాలు, అవినీతికి పాల్పడే వాళ్లకు పార్టీలో ఎంట్రీ కూడా ఉండదన్నారు.