నినాదాలు మస్తు ఇస్తడు..కానీ అమలు చేయడు

నినాదాలు మస్తు ఇస్తడు..కానీ అమలు చేయడు

సీఎం కేసీఆర్ నినాదాలు మస్తు ఇస్తరని..కానీ వాటిని అమలు చేయ్యరని ఎంపీ అర్వింద్ విమర్శించారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు, నినాదాలు ఇచ్చారని..కానీ ఒక్కటన్నా అమలైందా అని ప్రశ్నించారు. గత మూడు నాలుగేండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లు అంటూ ప్రతీ సభలో హామీలిచ్చారని..ఇంత వరకు వారికి ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. కేసీఆర్ దృష్టిలో తెలంగాణ జర్నలిస్టులు ఉన్నంత ప్రశాంతంగా ఎక్కడా లేరని  చెప్పారు. 

సొంత బిజినెస్ పనులు చూసుకునేందుకే మంత్రి కేటీఆర్ దావోస్ పోతడని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ప్రభుత్వం ఖర్చుల మీద దావోస్ వెళ్లి పెట్టుబడులు తెచ్చినట్లు బిల్డప్ ఇస్తాడని మండిపడ్డారు. దావోస్ వెళ్లి కేటీఆర్ ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చాడో..ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చాడో చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశాడు. 

అతి వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట తీవ్రంగా నష్టపోయిందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఫసల్ బీమా అమలైతే పసుపు రైతులకు కొంతైనా నష్టపరిహారం దక్కేదన్నారు. కానీ కేసీఆర్ ప్రీమియం చెల్లించకపోవడంతో తెలంగాణలో ఫసల్ బీమా అమలవడం లేదని చెప్పారు. పేదల కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే అందులోనూ  నిబంధనలు పెట్టి ..కేంద్రం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కోసం ఓ బాబా అగ్రిబేస్ ఇండస్ట్రీ పెడతానంటే..ప్రశాంత్ రెడ్డి..ఆయన అక్కడ కమీషన్ల భయానికి పారిపోయిండని ఆరోపించారు. నందిపేటకు గత 9 ఏండ్లుగా ఒక్క అగ్రిబేస్ ఇండస్ట్రీ కూడా రానివ్వడం లేదన్నారు. ఇటు జిల్లాలో 2021-22లో డబుల్ బెడ్ ఇండ్ల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయిస్తే..కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చురకలంటించారు. నంగనాచి మాటలు మాట్లాడే ప్రశాంత్ రెడ్డి..ముందు ప్రజల కోసం పని చేయాలని సూచించారు.