
జగిత్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి, మానిటరింగ్(దిశ) కమిటీ మీటింగ్ కు టీఆర్ఎస్ నేతలు గైర్హాజరు కావడంపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తప్పులు బయటపడతాయనే సమావేశానికి రాలేదన్నారు. సర్వశిక్షా అభియాన్ లో విడుదల చేసిన రూ.32 కోట్ల నిధుల ఖర్చుపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో ఖర్చులపై పర్యవేక్షణ చేయాలని దిశా సభ్యులకు ఎంపీ అర్వింద్ సూచించారు. 2015 నుంచి ఆర్ అండ్ బీ శాఖకు రూ.191 కోట్ల నిధులు విడుదల కాగా..పైసా నిధులు జిల్లాకు రాలేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కిట్ లో సగం పైసలు కేంద్రానివే అని అధికారులు చెబుతున్నారని..ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుందన్నారు.రాష్ట్రంలో కోట్లాది రూపాయలను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని..వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తామన్నారు.