ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్,  వెలుగు:  ప్రైవేట్ సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సంచార్ భవన్‌‌‌‌‌‌‌‌లో సోమవారం టెలిఫోన్ అడ్వైయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అయిన అర్వింద్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆధునాతన టెక్నాలజీతో  ప్రైవేట్ రంగ సంస్థలు వినియోగదారులకు అడ్వాన్స్ సేవలను అందిస్తున్నాయన్నారు. వారితో పోటీ పడుతూ బిఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సేవలందించాలన్నారు. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్​ డేట్ కావాలని ఆఫీసర్లకు సూచించారు. జిల్లాలో టెలీకాం సేవలపై తరుచూ సమీక్షించాలన్నారు. సర్వీస్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి తమ బాధ్యతగా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో సీజీఎం, డీజీఎం టెలికామ్ బోర్డు సభ్యులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.

వీఆర్ఈసీలో ఘనంగా ఫార్మాసిస్ట్​ డే 

మాక్లూర్, వెలుగు: ఫార్మసీ రంగం మనం బాగా అభివృద్ధి చెందామని.. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఫార్మసీ స్టూడెంట్లకు మంచి ఫ్యూచర్ ఉంటుందని విజయ రూరల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, ఫార్మసీ కాలేజీ చైర్మన్ కె.నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దాస్​నగర్ సమీపంలోని ఉన్న వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈసీలో ఫార్మాసిస్ట్​డేను ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్లు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఫార్మాసిస్ట్ ఉమారాణి, కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌  సి.హెచ్ సురేశ్‌‌‌‌‌‌‌‌, టి.రాధాకిషన్, బోగ శ్రీనివాస్, వాసుగౌడ్, స్టూడెంట్లు పాల్గొన్నారు. 

ప్రజలంతా సంఘటితంగా ఉండాలి

పిట్లం, వెలుగు: ప్రజలంతా సంఘటింగా ఉంటేనే మనం శక్తివంతులమవుతామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఇందూర్​ వ్యవస్థాక ప్రముఖ్ బెజుగం సత్యనారాయణ అన్నారు. సోమవారం పిట్లంలో నిర్వ హించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రాథమిక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్గాలుగా విడిపోయిన హిందూ సమాజాన్ని ఒక్కటి చేయడానికి డాక్టర్​జీ 1925లో సంఘ్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారని గుర్తు చేశారు. వారం రోజుల పాటు నిర్వహించే శిబిరంలో యువకులకు దేశంపై భక్తి, ప్రేమ పెరగడానికి శారీరకంగా మానసికంగా శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో శిబిరం అధికారులు సంతోష్, అంబదాస్, శ్రీకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.

తహసీల్దార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనులు చేయడం లేదు 

నందిపేట, వెలుగు: తహసీల్దార్ కార్యాలయానికి సమస్యలతో వచ్చే ప్రజలకు ఎలాంటి పనులు జరగడం లేదని మండల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ వాకిడి సంతోష్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఎజెండా అంశాలు, వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూ సమస్యలు, కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌కార్డులు, తదితర అంశాలపై మాట్లాడుతుండగా కోమట్‌‌‌‌‌‌‌‌పల్లి సర్పంచ్ మగ్గిడి నాగరాజు, చింరాజ్‌‌‌‌‌‌‌‌పల్లి సర్పంచ్ గణేశ్‌‌‌‌‌‌‌‌ కల్పించుకున్నారు. ఆధార్​మార్పు చేర్పులపై గెజిటెడ్ సంతకం అవసరం ఉంటే తహసీల్దార్ పెట్టడం లేదని, డిజిటల్ సంతకం చేయక ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో సర్వే నెంబర్లు గల్లంతయిన రైతులు ఆఫీసు చుట్టూ తిరిగినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలపై ఆఫీసుకు వస్తే తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఎస్సై శ్రీకాంత్​ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎంపీడీవో నాగవర్ధన్​ మాట్లాడుతూ టీఎస్  బిపాస్ ద్వారా ఇంటి నిర్మాణాలకు అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ పరిధిలో అయినా, టౌన్​ప్లానింగ్ పరిధిలో అయినా 21 రోజుల్లో పర్మిషన్​ వస్తుందని, లేటయితే పర్మిషన్ వచ్చినట్టే భావించా లన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కిరణ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.  

సైబర్ నేరాలపై అవగాహన

మాక్లూర్, వెలుగు: మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై మండలంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధర్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ఈ అవేర్నెస్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో కోఆర్డినేటర్లు సంధ్య, రఫీ పాల్గొని మాట్లాడారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ 1996లో స్థాపించినట్లు చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీత కృష్ణన్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పోలీస్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారుల సాయంతో తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 26 వేల మంది అమ్మాయిలు, మహిళలను కాపాడినట్లు వివరించారు. కార్యక్రమంలో డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి ఐసీడీఎస్ సీడీపీవో సౌందర్య, సూపర్ వైజర్ బుజ్జి,  అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

హాస్టల్ రిపేర్‌‌‌‌‌‌‌‌కు చర్యలు

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌‌‌‌కు రిపేర్ చేపట్టి వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ ఆఫీసర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఈనెల 24న ‘వెలుగు’లో  ‘పైసలు ఇస్తలేరు.. రిపేర్​ చేస్తలేరు..’ అనే శీర్షికతో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. వారం రోజుల్లో డోర్లు, కరెంట్‌‌‌‌ వైరింగ్ రిపేర్ చేయాలని ఆఫీసర్లకు సూచించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలతో సోమవారం డీఈవో ఆఫీసు నుంచి స్టాఫ్‌‌‌‌ వెళ్లి హాస్టల్‌‌‌‌ను​ పరిశీలించారు.

టీఆర్ఎస్‌‌‌‌కు పేదల ఉసురు తగులుతుంది

భిక్కనూరు, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుపేదల ఉసురు తగులుతుందని సీపీఎం రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం మండలంలోని జంగంపల్లిలో ఇండ్ల స్థలాల కోసం గ్రామానికి చెందిన కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకుని చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ హయాంలో ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు స్థలాలు కేటాయించకుండా ప్రస్తుత సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తక్షణమే పట్టాలు ఉన్న వారందరికీ స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌‌‌‌గౌడ్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వ్యవసాయ సంఘ సభ్యులు మోతీరామ్, కొత్త నర్సింలు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే లక్ష్యం

కామారెడ్డి, వెలుగు: పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్​ పేర్కొన్నారు. సోమవారం రాజంపేట మండలం పొందూర్తిలో  కొత్తగా శాంక్షన్ చేసిన ఆసరా ఫించన్‌‌ కార్డుల పంపిణీతో పాటు డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌గా ఉందన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ సరోజ, జడ్పీటీసీ కొండా హన్మండ్లు, ఎంపీటీసీ బాలరాజుగౌడ్, సర్పంచ్‌‌‌‌ గంగాకిషన్, పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్ బిక్కాజీ బల్వంత్‌‌‌‌రావు, లీడర్లు మోహన్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో సీఎంఆర్ఎఫ్​ చెక్‌‌‌‌లను లబ్ధిదారులకు అందజేశారు.

మండపాల వద్ద రూల్స్‌‌ పాటించాలి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: దుర్గా మాత ఉత్సవ కమిటీలు తమ మండపాల వద్ద రూల్స్‌‌‌‌ కచ్చితంగా పాటించాలని సీపీ నాగరాజు సోమవారం తెలిపారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం పోలీసు నుంచి అనుమతి పొందాలని, విగ్రహాల ఏర్పాటు కోసం బలవంతంగా ప్రజల నుంచి వసూలు చేయరాదన్నారు. మండపాల సందర్శనకు వచ్చే మహిళలు, యువతులపై ఈవ్ టీజింగ్ జరగకుండా చూడాలన్నారు. స్పీకర్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, రాత్రి 10 గంటల తర్వాత మైక్‌‌‌‌సెట్లు బంద్‌‌‌‌ చేయాలన్నారు. డీజేలు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగించే ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని సూచించారు.

మనసుని నియంత్రించుకోవాలి

నిజామాబాద్ టౌన్, వెలుగు: మనసును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని హర్యానా కురుక్షేత్రం స్వామి విదేహీ మహరాజ్ అన్నారు. ఇందూరులోని ఆర్య సమాజ్‌‌‌‌‌‌‌‌లో వారం రోజల పాటు జరిగే యోగా శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు నడపడానికి ట్రైనింగ్ ఎలా తీసుకుంటామో.. మనసును నడపడానికి కూడా ట్రైనింగ్ తీసుకోవడం అంతే ముఖ్యమన్నారు. ఇటు వంటి యోగా శిబిరాల ద్వారా మనసును ఎలా కంట్రోల్‌‌‌‌‌‌‌‌ ఉంచుకోవాలో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు రామలింగం, కార్యదర్శి మహంకాళి విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్, వేద పండితులు వేద మిత్ర, పద్మ, విశ్వనాథ్ పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట ధ్వంసం

కోటగిరి (వర్ని), వెలుగు: వర్ని మండలంలోని సైదాపూర్ తండాకు చెందిన నేనావత్ దూదియా నాయక్ మొక్కజొన్న పంటను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నరికేశారు. చేతికి వచ్చిన పంటను  ధ్వంసం చేయడంతో దాదాపు రూ.60 వేల నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై సోమవారం స్థానిక పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయగా వర్ని ఏఎస్సై బాబురావు ఘటన స్థలానికి చేరుకుని పంటను పరిశీలించారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.కిషన్‌‌‌‌‌‌‌‌రాథోడ్‌‌‌‌‌‌‌‌ ధ్వంసమైన పంట పొలాన్ని పరిశీలించారు. 

ఐలమ్మ పోరాటాలు మరువలేం..

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న ఐలమ్మ విగ్రహాలకు, ప్రభుత్వం, ప్రైవేట్‌‌‌‌ సంస్థల్లో ఆమె ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి , వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలను పలువురు వక్తలు కొనియాడారు.

- వెలుగు, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌