ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగడం తప్ప..చేసిందేమి లేదు

ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగడం తప్ప..చేసిందేమి లేదు

పసుపు రైతులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ చేసేందేమీ లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వ్యాపారుల నుంచి చందాలు వసూళ్లకే రెండు పార్టీల నేతలు పరిమితమయ్యారన్నారు. తాను ఎంపీ అయ్యాకే నిజామాబాద్ లో స్పైస్ బోర్డు ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటయిందన్నారు. దీంతో నిజామాబాద్ పసుపు ఎగుమతికి హబ్ గా మారిందని చెప్పారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఫోటోలు దిగడం తప్ప .. రైతుల కోసం ఏమీ చేయలేదన్నారు అరవింద్. తెలంగాణలో పసుపు పంట పండించే రైతుకు లభించే ధర క్రమంగా పెరుగుతుందన్నారు. సీఎం పదవులను కూడా వందల కోట్లకు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అమ్ముకుంటున్నాడన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దళారుల నుండి చందాలు తీసుకుని రైతులకు అన్యాయం చేస్తాయన్నారు.

see more news

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త