ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..జనతా కర్ఫ్యూను పాటిద్దాం

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..జనతా కర్ఫ్యూను పాటిద్దాం

జనాతా కర్ఫ్యూని అందరూ పాటించాలన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్ . కరోనా రోజు రోజుకి విస్తరిస్తుండటంతో  అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మన కంటే ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వెనుకబడ్డాయన్నారు.  కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల మన దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు. కరోనా నివారణ చర్యల్లో మోడీని ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయన్నారు.

అందరూ ఇంట్లోనే ఉండాలని.. అత్యవసర పరిస్థితులుంటేనే బయటకి రావాలన్నారు. ఏప్రిల్ 15 వరకు అందరు ఆత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. శుభకార్యాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలన్నారు.  కరోనా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్షం వద్దని..తామందరం కలిని కరోనాను నిర్ములిద్దామన్నారు.

గల్ఫ్ నుండి వచ్చే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. తమకు రాజకీయాలకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు.  సిఎం కేసీఆర్ కరోనా నివారణకు బార్లు, స్కూళ్ళు మూయిస్తే ఆయన కూతురు ఎన్నికల కోసం క్యాంపు నిర్వహించటం దురదృష్టమన్నారు. కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష వైఖరిని ఖండిస్తున్నామన్నారు.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు చేయటం సిగ్గు చేటన్నారు. ఒక వైపు ప్రధాని కర్ఫ్యూ అంటుంటే టీఆర్ఎస్ మాత్రం క్యాంపు పేరుతో ప్రజాప్రతినిధుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందన్నారు.