- డిప్యూటీ సీఎంను కలిసి ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణ పనుల నిధులు రిలీజ్ చేయాలని ఎంపీ అర్వింద్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. బుధవారం సెక్రటేరియట్‌కు వెళ్లిన ఆయన డిప్యూటీ సీఎంను కలిసి మాట్లాడారు. మాధవ్‌నగర్, అర్సాపల్లి, అడివి మామిడిపల్లి ఆర్వోబీలకు చెందిన రూ.13.5 కోట్ల బిల్స్ ఆగిపోయాయని తెలిపారు. దీంతో పనులు జరగడంలేదని చెప్పగా ఫండ్స్ రిలీజ్ చేయడానికి డిప్యూటీ సీఎం అంగీకరించినట్లు తెలిపారు.
