
జనగామ అర్బన్, వెలుగు: కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కోరారు. గురువారం జనగామలో పర్యటించిన ఆయనకు అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురాం ప్రధాని మోదీకి రాసిన పోస్ట్‌కార్డును అందించగా సంతకం చేశారు.
ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 500 మందితో రాయించిన పోస్ట్‌కార్డులను ప్రధానికి పంపిస్తున్నట్లు పరశురాం తెలిపారు. 26 జనవరి 2026 వరకు లక్ష పోస్ట్‌కార్డులు పంపనున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్శివరాజ్ యాదవ్, నాయకులు మేడె శ్రీనివాస్, పులి శేఖర్, తిప్పారపు ప్రసాద్, కె.నాగరాజు, కె.ప్రవీణ్ పాల్గొన్నారు.