బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు మేం సిద్ధం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు మేం సిద్ధం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • ప్రతిపక్ష నేత పదవి నువ్వు తీసుకుని అసెంబ్లీకి రా.. హరీశ్​కు చామల సవాల్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్ష నేత పదవి తీసుకుని అసెంబ్లీకి రావాలని హరీశ్​రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. గోదావరి, కృష్ణా జలాల మీద కాంగ్రెస్ పార్టీ నేతలకు అవగాహన లేదంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలని అంటున్నారని చామల తెలిపారు. సమావేశాలకు తామూ రెడీగానే ఉన్నామని చెప్పారు. అయితే, కేసీఆర్ దగ్గర ఉన్న ప్రతిపక్ష నేత పదవి తీసుకొని హరీశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చించుకుందామని తెలిపారు.