యాదాద్రి, వెలుగు: టీచర్స్హక్కులను పరిరక్షించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కోరారు. టెట్ఎగ్జామ్ తప్పనిసరి చేసిన అంశంపై బుధవారం ఆయన మాట్లాడారు. 2010 ఆగస్టు 23కు విధుల్లో చేరిన టీచర్స్‌కు టెట్‌ను తప్పనసరి చేయడం వల్ల ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టెట్ విషయంలో పలుమార్లు భిన్నమైన స్టేట్మెంట్స్రావడం వల్ల అనేకమంది టీచర్స్ టెట్రాయలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఎగ్జామ్‌కు హాజరుకాని వారికి ఇప్పుడు మళ్లీ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. ఈ కారణంగా టీచర్స్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి హక్కులను కాపాడడానికి ఆర్టీఈ 2009, ఎన్సీటీఈ 1993 యాక్ట్‌లను సవరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
