
- సీఎం ఎక్కడి నుంచైనా రివ్యూ చేస్తరు: ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో హరీశ్ రావుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెల్వదని, ఈ విషయంలో ఆయన రోల్ మోడల్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలోనే కేసీఆర్ త్యాగాల నేత అని హరీశ్‌రావు అంటుండు.. దళితుడిని సీఎం చేస్తానని తానే పదేండ్లు సీఎం పదవి అనుభవించిండు. ఇప్పుడేమో అధికారుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తా అంటుండు.. సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టినందుకే సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష చేస్తున్నడని మాట్లాడుతున్నడు. సీఎం ఎక్కడి నుంచైనా సమీక్ష చేయొచ్చు. ములుగు అడవుల్లో నైనా రివ్యూ చేస్తారు’’అని చామల అన్నారు.
కేసీఆర్ మూడేండ్లకే సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారని, ఆయన స్వర్గానికి సీఎం అవుతారా? లేక
నరకానికా? అని ప్రశ్నించారు. ‘‘ఇంట్లో ఈటల రాజేందర్ రెడ్డి.. గేట్ బయటకు రాగానే ఓబీసీ నాయకుడు. బీఆర్ఎస్ను వదిలిపెట్టిన అంటున్నడు. 24 గంటలూ ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నడు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నట్లు ఆ పార్టీ లీడర్లే గుర్తించట్లేదు. ఈటల రాజేందర్ ఓ కన్ఫ్యూజ్ పొలిటీషన్. పార్టీలో ఏ పదవి రావట్లేదని కాంగ్రెస్ లీడర్లపై ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నడు’’అని చామల అన్నారు.