తెలంగాణ జోలికి రావొద్దు : ధర్మపురి అరవింద్

 తెలంగాణ జోలికి రావొద్దు : ధర్మపురి అరవింద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని చెప్పారు. సజ్జలను ఎవరైనా సలహాదారుడిగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ‘ఒకప్పుడు తమిళనాడు నుంచి అంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్లీ అంధ్రను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి అంతేతప్ప తెలంగాణ జోలికి రావొద్దు’ అంటూ మండిపడ్డారు. 

తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైఎస్ఆర్ కాంగ్రెస్​పార్టీనే అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సజ్జల కామెంట్స్ పై తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.