తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్
  • తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్–బీజేపీ మధ్యే  పోటీ
  • 3 రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ ఉచితాలు తిరస్కరించారు
  • బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని, ఆ పార్టీ మనుగడ ఇక కష్టమేనని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీని  ప్రజలే తిరస్కరించారని చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన ఉచితలను తిరస్కరించారని చెప్పారు. ఇవాళ ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అనుకూలత కారణంగానే విజయం సాధ్యమైందని చెప్పారు.  

పార్లమెంటు సెమీఫైనల్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారని చెప్పారు. నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ ఓబీసీ వ్యతిరేకులేనని లక్ష్మణ్​ చెప్పారు. దక్షిణ, ఉత్తర భారతం అంటూ కాంగ్రెస్ విభజించే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు.  ఉత్తర భారత ఓటర్లను కించపరిచేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు.  ద్రవిడ, ఆర్య అంశాన్ని తెరమీదకు తెచ్చి కాంగ్రెస్ పబ్బం గడువుకుంటుందని విమర్శించారు.  మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు.