సీఎం పీఏ జైపాల్ రెడ్డి తండ్రికి ఎంపీ, స్పీకర్ నివాళి

సీఎం పీఏ జైపాల్ రెడ్డి తండ్రికి ఎంపీ, స్పీకర్ నివాళి

ఉప్పునుంతల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పీఏ జైపాల్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి దశదినకర్మ వారి స్వగ్రామం ఉప్పునుంతల మండలంలోని తిరుమలాపూర్ లో సోమవారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ మల్కాజ్​గిరి ఇన్​చార్జి మైనంపల్లి హనుమంతరావు, సీఎం సోదరుడు కృష్ణారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్.రెడ్డి, ఎస్సీ సెల్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జగన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రామచంద్రారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని స్పీకర్​కోరారు.  

బాధిత కుటుంబానికి పరామర్శ

వంగూరు, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిండి చింతపల్లికి చెందిన మామిడాల ముత్యాల రెడ్డి తల్లి యశోదమ్మ అనారోగ్యంతో చనిపోయారు. సోమవారం ఆమె దశదినకర్మకు స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యా కమిషన్ మెంబర్ వెంకటేశ్, గాయకుడు ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.