ఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. అమెరికా బయల్దేరిన పెద్దపల్లి ఎంపీ

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు  ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. అమెరికా బయల్దేరిన పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశాలకుహాజరయ్యేందుకు మంగళవారం (అక్టోబర్ 07) అమెరికా బయలుదేరి వెళ్లారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో ఇండియా తరఫున పాల్గొంటున్నారు. 

దేశాభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ఈసారి జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ఎంపీగా గడ్డం వంశీకృష్ణ నిలిచారు. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, కుమారి షెల్జా మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో వంశీకృష్ణ భేటీ అవుతారు.