కేసీఆర్ చేసింది దేశ ద్రోహం: ఎంపీ కే లక్ష్మణ్

కేసీఆర్ చేసింది దేశ ద్రోహం: ఎంపీ కే లక్ష్మణ్
  • టెలిగ్రాఫ్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఫోన్ల ట్యాపింగ్
  • దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థను నిర్వీర్యం చేశారు  
  • బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు బురద అంటించే ప్రయత్నం
  • పోలీసు వ్యవస్థను బిడ్డ కోసం జేబు సంస్థలా వాడారు
  • సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
  • టెన్ జన్ పథ్ ఒత్తిడా..? రహస్య ఒప్పందమేదైనా ఉందా?
  • ప్రజాక్షేత్రంలో కొట్లాడుతం.. న్యాయ పోరాటం చేస్తాం
  • ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్​

హైదరాబాద్: పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పోలీసు వ్యవస్థను తన జేబు సంస్థలా వాడుకున్నారని, టెలిగ్రాఫ్ యాక్టుకు భిన్నంగా విదేశాల నుంచి పరిక రాలు తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్​ ఆరోపించారు.

ఇవాళ ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ..మూడు ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్ల టైంలో బీజేపీని కట్టడి చేసేందుకు, ఆర్థిక మూలా ల ను దెబ్బతీసేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వినియోగించుకున్నార అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన అధికారుల కన్ఫెషన్ స్టేట్ మెంట్లు చూస్తుంటే ది మ్మ తిరిగే నిజాలు బయటికి వస్తున్నాయని అన్నారు. విధిలేని పరిస్థితిలో పెద్దాయని చెబితేనే చేశామని నేరాన్ని అంగీకరించారని అన్నారు.

అక్రమంగా దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు, బిడ్డను లిక్కర్ స్కాం కేసు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఫోన్లు ట్యాపింగ్ చేశారని అన్నారు. ఈ వ్యవహా రం లో కీలక సూత్రధారి అయిన ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను రప్పించి అసలు దోషులను బయటికి తీసుకు రావా లని లక్ష్మణ్​ డిమాండ్ చేశారు.

దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన వ్యవస్థను దుర్వినియోగం చేసిన అప్పటి సీఎం కేసీఆర్ పై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఇదే అదనుగా పోలీసులు సైతం రెచ్చిపోయారని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, పార్టీలకు సాయం చేసే వారిని బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లను సైతం సమకూర్చారని అన్నారు. 

దాచుకున్న సొమ్మును కక్కించండి

కేసీఆర్ అక్రమంగా సంపాదించి దాచుకున్న సొమ్మును కక్కిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు కక్కించాలని డిమాండ్ చేశారు. తమ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని, అందులో కీలకమైన ఉగ్రవాదుల సమాచారం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం ఉగ్రవాదుల దాడులకు బలైపోయినా పరవాలేదు కానీ తమ కుటుంబం సేఫ్ గా ఉండాలనే ధోరణితోనే కేసీఆర్ ఉన్నారని అన్నారు.

ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా బాధితుడని, ఆయనను బిడ్డ పెండ్లి సమయంలో అరెస్టు చేశారని లక్ష్మణ్​ గుర్తు చేశారు. స్వయంగా బాధితుడైన రేవంత్  రెడ్డి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెన్ జనపథ్ ఒత్తిడి మేరకా.. కేసీఆర్ తో ఏదైనా రహస్యం ఒప్పందం జరిగిందా..? అనే అనుమానాలున్నాయని అన్నారు. 

బీఎల్ సంతోష్ కు బురద పూస్తారా..?

కేసీఆర్ తన బిడ్డ కవితను లిక్కర్ స్కాం కేసు నుంచి విముక్తురాలిని చేసేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు నిందితుల కన్ఫెషన్ స్టేట్ మెంట్లను బట్టి అర్థమవుతోందని అ న్నారు. ఆపరేషన్ ఫాం హౌస్ వ్యవహారం నడిపి.. బీఎల్ సంతోష్ ను ఇరికించే ప్రయత్నం చేశారని దిమ్మతిరిగే నిజం బయటపడిందన్నారు. బీఎల్ సంతోష్ మచ్చ లేని నాయకుడని, దేశం కోసం ధర్మం కోసం జీవితాన్ని ధార పోశారని చెప్పారు.

ఒక ప్రచారక్ గా కొనసాగే వ్యక్తిపై కుట్రలు చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెరపైకి తెచ్చారని అన్నారు. దేవుడు ధర్మం వైపు ఉన్నందునే బీజేపీ జాతీయ నాయకు లను ఆదుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లక్ష్మణ్​ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రతి పల్లెకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కొట్లాడు తామని, అటు న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.