కవులు, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ : ఎంపీ కడియం కావ్య

కవులు, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ : ఎంపీ కడియం కావ్య

హనుమకొండ, వెలుగు: కవులు, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ అని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కాకతీయ నృత్య, నాటకోత్సవాల ముగింపు వేడుకలకు ఎంపీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులను సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ బమ్మెర పోతన, సోమనాథుడు లాంటి మహానుభావుల వారసత్వాన్ని స్వీకరించిన కవులు, రచయితలకు వరంగల్ నిలయమన్నారు.

 దాశరథి, కాళోజీ సోదరులాంటి ఎంతోమంది వరంగల్ సాహిత్యరంగంలో స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు. వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించి ప్రారంభించిందన్నారు. ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల, ఇతర కవులు, కళాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.