
ఇటీవల ఎంపీగా గెలిచినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తన తమ్ముడు వరుణ్ రనౌత్ పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సంధర్బంగా ఆమె తన తమ్ముడికి చంఢీగడ్‌లో ఖరీదైన లగ్జరీ ఇంటిని పెళ్లి కానుకగా ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. దాంతో ఆ ఇంటి ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఉన్న సమయంలో దేశంలో ఎమెర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. అసలు ఆ సమయంలో ఎం జరిగింది? దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఆ సమయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎం చేసింది? అనే నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకురాలు కూడా కంగనా నే. మరి చాలా ఆసక్తికరమైన కథతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.