
పేదలను ఆర్థికంగా ఆదుకోవటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు ఎంపీ కవిత. కుల వృత్తులను సర్కారు ప్రోత్సహిస్తోందన్నారు. చేతి కుల వృత్తుల వారి కుటుంబ ఆదాయం పెంచేందుకు కొత్త కొత్త పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. నిజామాబాద్ లో టెలికాం సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న కవిత.. BSNL 4G సేవలు ప్రారంభించారు. కలెక్టరేట్ మైదానంలో మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలు అందించారు. రాష్ట్రంలో 10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు కవిత. గొల్ల, కురుమలకు ఇస్తున్న చేయూతతో గ్రామాల్లో సంపద సృష్టిస్తున్నామన్నారు.