అంగన్వాడీల తీరుపై ఎంపీపీ ఆగ్రహం

అంగన్వాడీల తీరుపై ఎంపీపీ ఆగ్రహం
  • పిట్లంలో మండల సర్వసభ్య సమావేశం

పిట్లం, వెలుగు: అంగన్వాడీల నిర్వాహణ తీరుపై ఎంపీపీ కవితావిజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పిట్లం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్​వైజర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లపై ఎంపీపీ మండిపడ్డారు. సెంటర్ల నిర్వాహణలో అలసత్వం వహిస్తున్నారని చెప్పినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పిల్లలకు కాలం చెల్లిన ఆహర పదార్థాలు ఇస్తున్నారని ఫైరయ్యారు. తమ పదవీకాలం ముగిసినా బాధలేదని ప్రతిపక్షంగా ఉండి అంగన్వాడీలతో పాటు ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని విధులు నిర్వహించాలని సూచించారు. 

అంతకుముందు వ్యవసాయ, విద్యుత్, వైద్యం, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఆర్టీసీ, ఆర్అండ్​బీ, రెవెన్యూ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లుగా మండలం అభివృద్ధిలో సహకరించిన అధికారులు, పాలకవర్గం సభ్యులు, పాత్రికేయులకు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెంబర్​అరికెల శ్రీనివాస్​రెడ్డి, వైస్​ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో కమలాకర్, నయాబ్  తహసీల్దార్​ సత్యనారాయణ, ఎంపీవో బ్రహ్మం, డీసీసీబీ డైరెక్టర్​ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.