టీఎస్పీఎస్సీ పేపర్ ను అధికార పార్టీ నేతలు రూ. 10లక్షలకు అమ్ముకున్నరు: ఎంపీ కోమటి రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ ను అధికార పార్టీ నేతలు రూ. 10లక్షలకు అమ్ముకున్నరు: ఎంపీ కోమటి రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ను అధికార పార్టీ వాళ్లు రూ. 10 లక్షలకు అమ్ముకున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. పేపర్ల లీకేజీ వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారని..కానీ కల్వకుంట్ల కుటంబం బంగారం అయిందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో కాంగ్రెస్  హాత్ సే హాత్  జోడో అభియాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. 

తెలంగాణ కోసం 1200 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో చదువుకున్న 30లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనుకుంటే అధికార పార్టీ వాళ్ళు పేపర్లను లీక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.