
పీసీసీ నాయకత్వంపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాకపోవడం బాధ కలిగించిందన్నారు. ఏపీలో వార్డు మెంబర్ కూడా లేని దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే టికెట్లు పంచి, మంత్రి పదవులు పంచుతుంటే తనతో పనేంటి అంటూ రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ పై కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి. రైతు నాయకుడిగా పనిచేసుకుంటూ పోతానన్నారు.