సీఎం కేసీఆర్ పై హత్యాయత్నం కేసు పెట్టాలి

సీఎం కేసీఆర్ పై హత్యాయత్నం కేసు పెట్టాలి
  • ఆర్టీసీ కార్మికుల మరణాలకు కేసీఆరే కారణం
  • మరణించిన వారి కుటుంభ సభ్యులకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలి
  • ఇబ్రహీంపట్నం లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇబ్రహీంపట్నం: సమ్మె చేస్తున్న కార్మికుల విషయంలో పంతాలకు, పట్టింపులకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న వారిని ఎంపీ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల విషయంలో గతంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ వారికి జీతాలు చేసుల్లిస్తున్నామని మాట్లాడారు. ఆండగా ఉంటామన్నారు. పక్క రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఆర్టీసీ విలీనం పై కమిటీ వేశారు. కానీ నేడు తెలంగాణలో ఉన్న 50 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై నీ కన్ను పడింది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ని ప్రైవేట్ పరం చేయడానికి యత్నిస్తున్నారు. బంధువులకు అమ్ముకోవడానికి చూస్తున్నారు. సోయి ఉందొ లేకనో 50 వేల మందిని ఉద్యోగాలు తీసేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా సమస్యను పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల మరణాలకు కేసీఆరే కారణం, ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై హత్యా యత్నం కేసు నమోదు చెయ్యాలి. మరణించిన వారి కుటుంభ సభ్యులకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలి. రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షంగా మా మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉంటుంది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చెయ్యాలి. అప్పటి వరకు పోరాడుతామని” వెంకటరెడ్డి అన్నారు.

తమను సంప్రదించకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని TNGO అధ్యక్షుడు రవీందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలన్నారు. సంవత్సరం క్రిందట ప్రకటించాల్సిన IR, PRC ని సీఎం ఇంత అర్ధాంతరంగా, ఆర్టీసీ సమ్మె చేస్తున్న సమయంలో ఎందుకు ప్రకటించారో అర్ధం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో గెజిటెడ్ ఉద్యోగులకు కూడా ఇదే గతి పడుతుందని,  కాబట్టి సూక్ష్మాన్ని గ్రహించి ఆర్టీసీ సంస్థకు మద్ధతు తెలపాలని కోరారు వెంకటరెడ్డి.

MP Komatireddy Venkat Reddy expresses solidarity with RTC workers' strike in Ibrahimpatnam