మాసాయిపేటలో రైతులకు అసైన్డ్ భూమి పంపిణీ చేసిన ఎంపీ

 మాసాయిపేటలో రైతులకు అసైన్డ్ భూమి పంపిణీ చేసిన ఎంపీ

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హకీంపేట, అచ్చంపేటలో జమున హెచరీస్ ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూముల్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు పంపిణీ చేశారు . ప్రొసిడింగ్ పత్రాలిచ్చి, సరిహద్దులు చూపించారు. కబ్జాదారుల  నుంచి రక్షించి పేదల భూముల్ని పేదలకే తిరిగి ఇస్తున్నామని ఎంపీ అన్నారు. పూర్తిగా సర్వే చేసిన తర్వాతే బాధితులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ అసైన్డ్ భూముల్ని కబ్బా చేశారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు రైతులు. రెవెన్యూ అధికారుల విచారణ తర్వాత తిరిగి భూ హక్కుదారులకు భూములు పంపిణీ చేస్తున్నారు. భూ పంపిణీలో ఉద్రికత్తత తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.

అంతకుముందు అసైన్డ్ దారులకు భూ హక్కులను పునరుద్దరించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భూముల సర్వే చేసిన అధికారులు.. భూములను ఆక్రమించుకున్నట్లు తేల్చారు. అసైన్డ్ భూముల్ని భూ హక్కుదారులకు పంచుతున్నారు. మరోవైపు అచ్చంపేటలో భూ పంపిణీ కార్యక్రమం ఉండటంతో బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఉదయం నుంచి నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్రమ అరెస్ట్ లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.