గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారు

గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారు

గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్  ను ప్రారంభించిన  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని లక్ష్మణ్ అన్నారు. గిరిజనులకు 10 %రిజర్వేషన్లు జీవో తోనే అమలైతే 8 ఏళ్ల నుంచి జీవో ఎందుకు ఇవ్వలేదని  కేసీఆర్ ని ప్రశ్నించారు.

మునుగోడు ఎన్నికలు వస్తున్నాయనే గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని, వారిని మోసం చేసేందుకు రిజర్వేషన్ల నాటకమని లక్ష్మణ్ తెలిపారు.  రిజర్వేషన్లను పెంచడమే కాకుండా దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని వెల్లడించారు. లేకపోతే దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటేనని, ఎన్ని అవినీతి పార్టీలు ఏకమైన  ప్రజలు మోడీ వైపునే ఉన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్ని బంధులు తీసుకువచ్చిన రాష్ట్రంలో టీఆర్ఎస్ బంద్  కావడం ఖాయమని లక్ష్మణ్ తెలిపారు.