తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తం: లక్ష్మణ్

తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తం: లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో  బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎలాంటి యాత్రలు చేసినా ప్రజలే నమ్మబోరన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో  బీజేపీ స్పీడ్ పెంచింది. ఆగస్టు 16 నుంచి  సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు  మూడు విడుతలుగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. మొదటి విడతలో 16న పల్లె బాట, బస్తీ బాట, ఈ నెల17న ప్రభుత్వ బాధితులతో, దరఖాస్తుదారులతో మండల, డివిజన్ ల వారీగా ముట్టడి, ఈ నెల18న అసెంబ్లీ నియోజకవర్గాలు కేంద్రంగా ప్రధాన రహదారులపై రాస్తారోకో, ధర్నా, ముట్టడి, దిగ్బంధం వంటి ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.

రెండో విడతలో భాగంగా.. ఈ నెల 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావ్, 24న రాష్ట్ర మంత్రుల ఘెరావ్, 27న జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలు చేపడుతామన్నారు. మూడో విడతలో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాన్ని  నిర్వహించనుంది.