కేసీఆర్​కు మళ్లీ అవకాశమిస్తే..చిప్ప కూడా మిగలదు : లక్ష్మణ్

కేసీఆర్​కు మళ్లీ అవకాశమిస్తే..చిప్ప కూడా మిగలదు : లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ప్రకటించిన హామీలను గడిచిన పదేండ్లలో ఎందుకు అమలు చేయలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్​కు పదేండ్లు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను బిచ్చం ఎత్తుకునే లా చేశాడని..  మళ్లీ ఇపుడు పొరపాటున చాన్స్​ ఇస్తే బిచ్చం ఎత్తుకునేందుకు చిప్ప కూడా మిగలదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో లక్ష్మణ్ మాట్లాడారు. ఉప ఎన్నికల్లో తన పార్టీని గెలిపిస్తే కుర్చి వేసుకొని కూర్చొని సమస్యలు పరిష్కరిస్తానని ప్రతి ఎన్నికల్లో చెప్పారని, తరువాత అడ్రస్ ఉండటం లేదని ఆయన మండిపడ్డారు.

బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ కా వికాస్, కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ కా వికాస్.. బీజేపీ అంటే సబ్ కా వికాస్ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందంతో మోదీ మూడో సారి ప్రధాని కాకుండా చెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దిక్కు, మొక్కు లేని కాంగ్రెస్ గ్యారంటీలను ఎవరూ నమ్మరని అన్నారు. రాజకీయాల్లో విస్మరించిన వర్గాలను ఆదరించడం కోసం బీసీ సీఎం

ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే కేసీఆర్, కాంగ్రెస్.. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయని లక్ష్మణ్​ మండిపడ్డారు. ఈ నిర్ణయాలతో ఆ పార్టీలు  భయపడుతున్నాయని ఆయన అన్నారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ లాగా వర్గీకరణపై ప్రధాని మోదీ వెనకడుగు వేసే వ్యక్తి కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.