అమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట

అమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట

లిక్కర్ స్కాం ఆరోపణలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా నార్తిండియాలో వ్యాపారం చేస్తున్న వారు తమ కుటుంబంపై చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తనకు, తన కుమారుడికి ఆ కంపెనీలో ఎలాంటి షేర్లు లేవని మాగుంట స్పష్టం చేశారు. గతంలోనే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాని గుర్తు చేశారు. ఈడీ ఆరోపణల్లో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అమిత్ అరోరాతో తనకు పరిచయమే లేదన్న మాగుంట.. ఈడీ రిమాండ్ రిపోర్టును పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. 

లిక్కర్ స్కాం కేసులో వినయ్‌ నాయర్‌కి సౌత్ గ్రూప్‌ నుంచి వంద కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రూప్‌ కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోందని ఈడీ పేర్కొంది. అందుకే వారి పేర్లను రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లు చెప్పింది.